calender_icon.png 19 January, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్డే

19-01-2025 12:00:00 AM

వరుణ్ తేజ్ పుట్టినరోజు నేడు. ఆయన 19 జనవరి 1990లో హైదరాబాద్‌లో జన్మించాడు. వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్టుగానే సినీరంగ ప్రవేశం చేశాడు. తన తండ్రి నాగేంద్రబాబు తీసిన ‘హ్యాండ్స్ అప్’ చిత్రంలో బాల నటుడిగా కనిపించారు. ఆ తరువాత ‘ముకుంద’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటించిన ‘కంచె’ చిత్రం ఆయన కెరీర్‌ను టర్న్ చేసింది. ఆ తరువాత ‘తొలిప్రేమ, ఎఫ్2, గద్దలకొండ గణేష్’ చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. 

ఇవాళ సింగర్ శ్రీరామచంద్ర పుట్టినరోజు. ఆయన 1986 జనవరి 19న ప్రకాశం జిల్లా అద్దంకిలో జన్మించాడు. శ్రీరామచంద్ర సినీ నేపథ్య గాయకుడు మాత్రమే కాకుండా నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తున్నాడు. ఎనిమిదేళ్ల వయసులోనే రవీంద్రభారతి వేదికపై తొలి పాట పాడాడు. 2010లో ఇండియన్ ఐడల్‌లో విన్నర్ కావడంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. శ్రీరామచంద్ర తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ పాటలు పాడాడు.