calender_icon.png 20 January, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్డే

18-01-2025 12:00:00 AM

నేడు దర్శకుడు సీఎస్ రావు జయంతి. 1924, జనవరి 18న కాకినాడలో జన్మించిన ఆయన 2004, డిసెంబర్ 8న కాలం చేశారు. తెలుగు సినిమా స్వర్ణ యుగపు దర్శకుడిగా కీర్తికెక్కిన సీఎస్ రావు పూర్తి పేరు చిత్తజల్లు శ్రీనివాసరావు. తెలుగు చలనచిత్ర పితామహుడు సీ పుల్లయ్య తనయుడు, అందాల నటి, నర్తకి రాజసులోచన భర్త.

తెలుగులో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలెన్నింటినో అద్భుతంగా ప్రేక్షకులకు అందించిన ఘనత ఆయనదే. స్పీడ్ డైరెక్టర్‌గానూ ఆయనకు పేరుంది. ఒకసారి సీన్ పేపర్ చూస్తే చాలు.. ఏ పేజీలో ఏ డైలాగ్ ఉందో చెప్పగలిగే జ్ఞాపకశక్తి సీఎస్ రావు సొంతం. ఇది ఆయన శత జయంతి సంవత్సరమిది.

ఈ సందర్భంగా సీఎస్ రావు కుమార్తెలు దేవి, కృష్ణ జనవరి 18న చెన్నైలో సెంటినరీ సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి సినిమా చరిత్రకారుడు వీఏకే రంగారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.