calender_icon.png 17 January, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్డే

17-01-2025 12:20:46 AM

బాలీవుడ్ ప్రముఖుడు జావేద్ అక్తర్ పుట్టిన రోజు నేడు. 1945, జనవరి 17న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో పుట్టిన ఆయన భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి ఎదిగారు. సినిమాల్లో గీత రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గానూ సత్తా చాటారు.

1973లో ‘జంజీర్’తో స్క్రీన్ రైటర్‌గా ఆయనకు పేరొచ్చింది. ‘దీవార్’, ‘షోలే’ చిత్రాలను రాసింది ఈయనే. 2010 నుంచి 2016 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన ఆయన కీర్తి కిరీటంలో భారత అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ (1999), పద్మ భూషణ్ (2007) చెప్పుకోదగ్గవి. 

దిశా పాండే 1994, జనవరి 17న జన్మించారు. జైపూర్‌లోని ఖేత్రినగర్‌లో పుట్టింది. దిశ తండ్రి విద్యాశా ఖలో అధికారి కాగా, తల్లి హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ ఉద్యోగి. బీఏ (మానవ హక్కులు)లో డిగ్రీ పూర్తి చేసిన దిశ 2012లో నితిన్ సత్యతో కలిసి ‘మయాంగినెన్ తయాంగినెన్’ అనే చిత్రం లో తొలిసారి నటించారు.

2013లో రమేశ్ రామర్తి దర్శకత్వంలో వచ్చిన ‘రేస్’ మూవీతో తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. అదే ఏడాది డైరెక్టర్ శ్రీకాంత్ వేములపల్లి తెలుగులో తెరకెక్కించిన ‘మోక్ష’ అనే భయానక చిత్రంలో నటించారు.