calender_icon.png 16 January, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్డే

16-01-2025 01:46:06 AM

ఇవాళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఆయన 1978 జనవరి 16న తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లా రాజపాలయంలో జన్మించారు. విజయ్ తమిళ్ చిత్రం ‘తెన్మెర్కు పరువాకత్రు’ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కొన్ని చిత్రాలకు పని చేశారు. విజయ్ సేతుపతి తెలుగులో 2019లో వచ్చిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

* నటుడు నవదీప్ పుట్టినరోజు నేడు. ఆయన 1985 జనవరి 26న నల్లగొండ జిల్లా పాలెంలో జన్మించారు. ‘జై’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ‘గౌతమ్ ఎస్‌ఎస్‌సీ’, ‘చంద మామ’ వంటి చిత్రాలు నవదీప్‌కు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. నవదీప్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. అలాగే బుల్లితెరపై కూడా నవదీప్ రాణిస్తున్నారు.