సాయాజీ షిండే బర్త్‌డే ఈరోజు. 1959, జనవరి 13న మహారాష్ట్రలోని సతారా జిల్లా సఖర్‌వాడి అనే చిన్న గ్రామంలో పుట్టారు. 1978లో ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ నీటిపారుదల శాఖలో కొద్దిపాటి జీతంతో కాలేజీలో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. అదే సమయంలో థియేటర్ ఆర్ట్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. ఆ అభిరుచే ఆయన్ను ముంబై చేర్చింది. మరాఠీలో ఏకపాత్రాభినయంతో నట ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన వివిధ భాషల ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు.
తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, భోజ్‌పురి భాషల్లో నాటకాలు, సినిమాల్లో నటించారు. ‘అబోలి’ చిత్రంలో తొలిసారి ‘సాయాజీ’ అనే పాత్రలో నటించారు. ఆ పాత్రకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించిన ఎన్నో సినిమాలతో ప్రేక్షకాదరణ పొందారు సాయాజీ షిండే.