ఇవాళ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పుట్టినరోజు. ఆమె 1991 జనవరి 12న మధ్యప్రదేశ్‌లోని పుణెలో జన్మించింది. అందాల పోటీల్లో పాల్గొని పలు టైటిళ్లను గెలుచుకున్న ప్రగ్యా ఆ తర్వాత మోడల్‌గా మారింది. 2014లో చిత్రం ‘డేగ’ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత ‘టిట్టూ ఎంబీఏ’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కంచె’ సినిమా టాలీవుడ్‌లో ఆమెను నిలబెట్టింది. ఇవాళ ప్రగ్యా పుట్టినరోజు నాడే ఆమె నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం విడుదలవడం విశేషం.
దర్శకుడు వసంత్ బాలన్ పుట్టినరోజు నేడు. ఆయన 1972 జనవరి 12న తమిళనాడులోని దేవతనంలో జన్మించారు. ఎడిటింగ్ అసిస్టెంట్‌గా సినీ పరిశ్రమ లో తన కెరీర్‌ను ప్రారంభించిన వసంత్ బాలన్.. ఆ తరువాత దర్శకుడు శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ‘ఆల్బమ్’ చిత్రంతో దర్శకుడిగా మారారు. 2012లో ‘ఏకవీర’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది తెలుగులో ‘ఏకవీర’ చిత్రం చేశారు. ఆ తరువాత ఆయన టాలీవుడ్‌లో చిత్రాలు చేసింది లేదు.