సుకుమార్ బర్త్‌డే నేడు. 1970 జనవరి 11న తూర్పు గోదావరి జిల్లా రాజోలు సమీపంలోని మట్టిపర్రు గ్రామంలో జన్మించారు. గణిత అధ్యాపకుడైన ఆయన సినిమాలపై ఆసక్తి తో 2000 సంవత్సరంలో సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలుత ఎడిటర్ మోహన్ దగ్గర సహాయకుడిగా పని చేశారు. 2004లో ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా మారి మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత ‘100% లవ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప’ చిత్రాలు ఆయనను స్టార్ డైరెక్టర్‌ని చేశాయి.
నేడు దర్శకురాలు బీ జయ జయంతి. ఆమె 1964 జనవరి 11న తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు. తొలుత సినిమా జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన జయ.. సినిమాపై మక్కువతో ఇండస్ట్రీకి వచ్చి కొన్ని చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేశారు. భర్త బీఏ రాజుతో కలిసి ‘సూపర్‌హిట్ ఫ్రెండ్స్’ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి ‘ప్రేమలో పావని కల్యాణ్’ సినిమాను తెరకెక్కించారు. తర్వాత ‘ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్‌లీ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.