calender_icon.png 10 January, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్డే

10-01-2025 12:00:00 AM

అల్లు అరవింద్ పుట్టినరోజు నేడు. ఆయన 1949 జనవరి 10న పాలకొల్లులో జన్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించి దానిపై సినిమాలు నిర్మిస్తున్నారు. తొలినాళ్లలో కొన్ని చిత్రా ల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తున్నా రు. 1974లో ‘బంట్రోతు భార్య’ అనే చిత్రాన్ని తొలిసారిగా నిర్మించారు. అక్కడి నుంచి అల్లు అరవింద్ ఎన్నో చిత్రాలను నిర్మించారు. 2020లో డిజిటల్ ఓటీటీ రంగంలోనూ అడుగు పెట్టారు. ‘ఆహా’ పేరుతో తెలుగుకు ప్రత్యేకంగా ఒక డిజిటల్ వేదికను తీసుకొచ్చారు. 

నటుడు హృతిక్ రోషన్ పుట్టినరోజు నేడు. ఆయన 1974 జనవరి 10న ముంబైలో జన్మించాడు. 1980వ సంవత్సరంలో బాలనటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ‘కహనా ప్యార్ హై (2000) చిత్రంతో హీరోగా తెరంగేట్రంచేశాడు. తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. కభీ ఖుషీ కభీ గమ్ (2001) చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో ఇక ఆయనకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

ఇవాళ కేజే ఏసుదాస్ పుట్టినరోజు. ఆయన పూర్తి పేరు కట్టస్సేరి జోసెఫ్ ఏసుదాస్. ఆయన 1955 జనవరి 10న కేరళ లోని పోర్ట్ కొచ్చిలో జన్మించా రు. భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడిగానే కాకుండా భారతీయ సినిమా నేపథ్య గాయకు డిగా సైతం ఆయన సుప్రసిద్ధుడు. ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషల్లో సుమా రు 80 వేల పాటలను పాడారు.