హీరో తరుణ్ పుట్టినరోజు నేడు. ఆయన 1983 జనవరి 8న హైదరాబాద్‌లో జన్మించారు. చిన్న వయసులోనే బాలనటుడిగా ఆయన సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. 1990లో వచ్చిన ‘అంజలి’ చిత్రం ద్వారా తరుణ్ తెరంగేట్రం చేశారు. ‘దళపతి’, ‘ఆదిత్య 369’, ‘గౌరమ్మ’ వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా రాణించారు. 2000వ సంవత్సరంలో ‘నువ్వే కావాలి’ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’ వంటి చిత్రాలు అద్భుత విజయం సాధించాయి.. తరుణ్‌ను లవర్ బాయ్‌గా ఇండస్ట్రీలో నిలబెట్టాయి.
దేవన్ శ్రీనివాసన్ పుట్టిన రోజు నేడు. ఆయన 1952 జనవరి 8వ తేదీన ట్రావెన్‌కోర్ జన్మించారు. తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాల్లో విలన్ పాత్రల్లో దేవన్ నటించారు. ఆయన మొత్తంగా 380కి పైగా చిత్రాల్లో నటించారు. 1985లో ‘వెల్లమ్’ అనే చిత్రంతో నిర్మాతగా మారారు. ఆయన 2004లో ఒక రాజకీయ పార్టీని సైతం స్థాపించారు. కేరళలో ‘పీపుల్స్ పార్టీ’ పేరుతో పార్టీని ప్రారంభించి.. ఆ తరువాత 2020లో నవ కేరళ పీపుల్స్ పార్టీ పేరుతో రీలాంచ్ చేశారు. 2023లో బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా కూడా దేవన్ పని చేశారు.