calender_icon.png 10 January, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యపీ బర్త్ డే

07-01-2025 12:00:00 AM

ప్రముఖ నటి బి. సరోజాదేవి పుట్టినరోజు నేడు. ఆమె 1942 జనవరి 7న కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో జన్మించారు. 1955 లో హోన్నప్ప భాగవతార్ నిర్మించిన మహాకవి కాళిదాస అనే కన్నడ సినిమా తో ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగులో ఆమెకు మొదట వచ్చిన అవకాశం ‘పెళ్లి సందడి’ కానీ ఆమె నటించిన ‘పాండురంగ మహత్యం’ సినిమా ముందు గా విడుదలైంది.  

* ఇవాళ క్రిష్ణస్వామి భాగ్యరాజ్ (కె భాగ్యరాజ్) పుట్టిన రోజు. ఆయన 1953 జనవరి 7న తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని వెళ్లన్ కోయిల్ అనే ఊరిలో జన్మించారు. ఆయన ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత. కొన్ని తెలుగు, హిందీ చిత్రాలకు సైతం భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. ‘చిలిపి పెళ్ళాం, మేం వయసుకు వచ్చాం’ వంటి చిత్రాల్లో భాగ్యరాజ్ నటించారు. గతేడాడి ‘35 చిన్న కథ కాదు’ అనే చిత్రంలోనూ నటించారు.

* శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మ ణ్యం చరణ్ పుట్టిన రోజు నేడు. ఆయన 1972 జనవరి 7న చెన్నైలో జన్మించారు. తమిళ, తెలుగు సిని మా పరిశ్రమల్లో నేప థ్య గాయకుడిగా ఎదిగారు. నటుడిగా, నిర్మాతగా, యాంకర్‌గానూ రాణించారు. కన్నడ చిత్రం ‘హుడుగిగాగి’తో నటుడిగా మారారు. ‘కాపిటల్ సినిమా వర్క్స్’  చిత్ర నిర్మాణ సంస్థ ఆయనదే. 

* నిర్మాత బీఏ రాజు జయంతి నేడు. 1960 జనవరి 7న విజయవాడలో జన్మించారు. కృష్ణకు పీఆర్వోగా ప్రస్థానాన్ని ప్రారంభించి, సినీ పాత్రికేయు డిగా రాణించారు. 2001లో నిర్మాతగా మారి.. తన సతీమణి దర్శకురాలిగా ‘ప్రేమలో పావని కళ్యాణ్’ చిత్రాన్ని తీశారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి చిత్రాల నిర్మించారు.