calender_icon.png 9 January, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యపీ బర్త్ డే

06-01-2025 12:00:00 AM

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పుట్టిన రోజు నేడు. 1967, జనవరి 6న మద్రాస్‌లో జన్మించిన ఆయన సోమవారం 58వ పడిలోకి అడుగిడుతున్నారు. ఆయన పూర్తి పేరు అల్లామ్ రఖా రెహమాన్. జన్మ నామం ఏఎస్ దిలీప్‌కుమార్. తండ్రి ఆర్‌కే శేఖర్ నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న ఆయన సంగీత దర్శకుడిగా, గీత రచయితగా, నిర్మాతగా ఎదిగారు. తొలినాళ్లలో వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చిన ఆయన ‘రోజా’ సినిమాతో మ్యూజి క్ డైరెక్టర్‌గా చిత్రసీమకు పరిచయమయ్యారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ తొలి చిత్రంతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం పొందారు.