దీపికా పదుకొణె నేడు పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. 1986, జనవరి 5న పుట్టిన ఆమె ఆదివారం 39వ పడిలోకి అడుగు పెడుతున్నారు. 2023 నాటికి దేశంలోకెల్లా అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా గుర్తింపు పొందిన దీపిక.. యుక్త వయసులోనే జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లలో బ్యాడ్మింటన్ ఆడారు. ఫ్యాషన్ మోడల్‌గా మారే యోచనతో క్రీడావృత్తిని వదిలేశారు. తర్వాత 2006లో ‘ఐశ్వర్య’ అనే కన్నడ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.