బెల్లకొండ సాయి శ్రీనివాస్ నేడు జన్మదినోత్సవాన్ని జరుపుకొంటున్నాడు. 1993, జనవరి 3న పుట్టిన ఈ యంగ్ హీరో శుక్రవారం 32వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. 2014లో ‘అల్లుడు శ్రీను’ చిత్రంతో సినీ రంగానికి పరిచయమయ్యాడు. ఆ తొలి చిత్రంతోనే శ్రీనివాస్ బెస్ట్ డెబ్యూ యాక్టర్‌గా ఫిలిం ఫేర్ పుర స్కారాన్ని అందుకున్నాడు.
ఇప్పటివరకు తొమ్మిది సినిమాల్లో కథానాయకుడిగా నటించిన శ్రీనివాస్ నుంచి త్వరలో ‘భైరవం’ చిత్రం రానుంది. అంతేకాదు శ్రీనివాస్ ఈ ఏడాది పెళ్లిపీటలెక్కను న్నట్టు ఆయన తండ్రి బెల్లకొండ సురేశ్ ఇటీవలే వెల్లడించారు.
నిక్కీ గల్రానీ.. 1992 జనవరి 3న బెంగళూరులో జన్మించింది. నేడు 33వ పడిలోకి అడుగుపెడుతోంది. నటి సంజన సోదరిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నిక్కీ.. నటిగా, మోడల్‌గా రాణిస్తోంది. 2014లో విడుదలైన ‘1983’ అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయమైన ఈమె తెలుగులో సునీల్ సరసన ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించడం ద్వారా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది. నిక్కీ నటించిన తమిళ చిత్రం ‘మరకత నానాయం’ (2017).. తెలుగులో ‘మరకత మణి’ పేరుతో అనువాదమైంది.
సైంధవి.. 1989, జనవరి 3న జన్మించారు. కర్ణాటక సంగీతంలో సాధన చేసిన ఈమె 12 ఏళ్ల వయస్సు నుంచే సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. తమిళ చిత్రసీమకు చెందిన ఈమె అక్కడ ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారాలు అందుకున్నారు. తెలుగులో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఆవకాయ్ బిర్యానీ’ చిత్రంలో ‘మామిడి కొమ్మకి..’ అనే పాట పాడారు. ‘శశిరేఖ పరిణయం’, ‘శక్తి’, ‘ఇష్క్’ వంటి చిత్రాల్లోనూ ఈమె పాడిన పాటలు సంగీత ప్రియుల ఆదరణ పొందాయి. 20213లో సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌ను వివాహం చేసుకున్నారు.