సుస్మితా సేన్ పుట్టినరోజు నేడు. ఆమె 1975 నవంబర్ 19న హైదరాబాద్‌లో జన్మించారు. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని పొందారు. దీనిని పొందిన తొలి భార తీయ మహిళ సుస్మిత సేనే కావడం విశే షం. ఆ తరువాత 1996లో ‘దస్తక్’ ఈనే హిందీ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ‘ఒకే ఒక్కడు’, నాగార్జున సరసన నటించిన ‘రక్షకుడు’ చిత్రాలు ఆమెకు తెలుగులో మంచి పేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం సుస్మిత సేన్ వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు.
హాస్య నటుడు వివేక్ పుట్టినరోజు నేడు. ఆయన పూర్తి పేరు వివేకానందన్. ఆయన 1961 నవంబర్ 19న తమిళనాడు రాష్ట్రంలోని తెన్కాసి జిల్లా, శంకరన్‌కోవిల్‌లో జన్మించారు. వివేక్ సింగర్ కూడా కావడం గమనార్హం. ‘ఉరుధి వేండుమ్’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. అటు సినిమాల్లో నటిస్తూనే సామాజిక కార్యకర్తగానూ సేవలందించారు. వివేక్ కళారంగ అభివృద్ధికి చేసిన కృషికి భారత ప్రభు త్వం ఆయనకు 2009లో పద్మశ్రీ అవార్డును ప్రదా నం చేసింది.
నటి షకీలా పుట్టిన రోజు నేడు. ఆమె 1973 మే 19న చెన్నైలో జన్మించారు. ఆమె తల్లి ఏపీకి చెందినవారు. తమిళంలో ‘ప్లేగర్ల్స్’ అనే సాఫ్ట్‌కోర్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా లో సిల్క్‌స్మిత కథానాయిక కావడం గమనార్హం. షకీల ‘కిన్నెర తుంబికళ్’ అనే మలయాళ చిత్రంతో ఫేమస్ అయ్యారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, క న్నడ, హిందీ భాషల్లో 100 చిత్రాల్లో షకీల నటించారు.