గాన సరస్వతి, కన్నడ కోగిలెగా పిలుచుకునే పి. సుశీల పుట్టినరోజు నేడు. ఆమె 1935 నవంబర్ 13న విజయనగరంలో జన్మించారు. 50 ఏళ్లకు పైగా సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగు, సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడారు. శ్రీలంక చిత్రాలకు సైతం సుశీలమ్మ పాడారు. 1952లో తొలిసారిగా తమిళ చిత్రానికి గాత్రం అందించారు. ఇక ఆ తరువాత ఆమె తిరిగి చూడలేదు.
నటి అభినయ 13 నవంబర్, 1991లో రాజమహేం ద్రవరంలో జన్మించారు. ఆమె పుట్టుకతోనే మూగ, చెవుడు. అయినా కూడా స్క్రిప్ట్‌ను అర్ధం చేసుకుని చక్కగా నటిస్తారు. ‘నాదోదిగిల్’ అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తరువాత తెలుగులో నేనింతే, కింగ్, సంగమం వంటి చిత్రాల్లో నటించారు. ‘శంభో శివ శంభో’ చిత్రం అభినయకు మంచి బ్రేక్ ఇచ్చింది.
శ్రీగౌరి ప్రియ 1998 నవంబర్ 13న హైదరాబాద్‌లో జన్మించారు. ‘నిర్మలా కాన్వెంట్ ’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయ మయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 10 చిత్రాల్లో నటించారు. మంచి గుర్తింపునిచ్చే పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు.