calender_icon.png 27 December, 2024 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్ డే

08-11-2024 12:00:00 AM

ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్ పుట్టినరోజు శుక్రవారమే. ఆమె అసలు పేరు ఉషా అయ్యర్. ఆమె 1947 నవంబర్ 8న ముంబైలో నివసిస్తున్న ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. ఉషా ఉతుప్ తొమ్మిదేళ్ల వయసులో తొలిసారిగా బహిరంగ ప్రదర్శన ఇచ్చారు. ఆమెకు సంగీతకారుడు అమీన్ సయానీ ఒక రేడియో ఛానల్‌లో పాడేందుకు అవకాశం ఇచ్చారు.

ఆ తరువాత ఆమెకు అవకాశాలు వెల్లువె త్తాయి. నైట్ క్లబ్‌లలో, హోటళ్లలో పాడుతుండగా దర్శకుల కంట పడ్డారు. అలా తొలిసారిగా ఉషకు ‘హరే రామ హరే కృష్ణ’ బాలీవుడ్ సినిమాలో గాయనిగా అవకాశం వచ్చింది. 1968లో ఆంగ్ల ఆల్బమ్‌లను విడుదల చేయడం..

అది అత్యంత ప్రజాదరణ పొందడంతో పలు సినిమాల్లో అవకాశాలొచ్చాయి. అలా తెలుగుతో సహా 15 భారతీయ భాషల్లో, అనేక విదేశీ భాషల్లోనూ పాడిన ఘనత ఉషా ఉతుప్‌ది.