calender_icon.png 1 April, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వంపై నమ్మకంతో కూడిన సంతోషం

31-03-2025 01:06:02 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి

ముషీరాబాద్, మార్చి 30: (విజయక్రాం తి): పదవీ విరమణ పొందాక ప్రభుత్వంలో    కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న 6 వేల 729 విరమణ పొందిన వారిని ఇంటికి పం పే నిర్ణయం ప్రభుత్వ పరిపాలనలో భవిష్యత్తుకు ఓ మార్గదర్శకం అవుతుందని తెలం గాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడలోని అడ్వకే ట్ జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  ఆయన మాట్లాడు తూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తదనంతరం ఎంతో మంది అధికారులు ప్రమోషన్ల కోసం  ఎదురుచూసి నిరాశపడ్డారన్నారు. అధికార రాజకీయ పార్టీకి ప్రత్యక్షంగాగాని, పరోక్షంగా కానీ అధికారులకు పదవీ విరమణ తదనంతరం  భృతిగా కాంట్రాక్టు పద్ధ తిలో పదవి కలగడం వల్ల పదోన్నతులకై ఎదురుచూసే అధికారులకు ఎంతో బాధ కలిగిందన్నారు. పరిపాలన పరంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తీసుకున్న నిర్ణ యం వల్ల నిజాయితీ కలిగిన అధికారుల్లో ప్రభుత్వంపై నమ్మకంతో కూడిన సంతోషం కలుగుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అధికారులు తమ బాధ్యతలను గుర్తెరిగి విశ్వసనీయతో పనిచేయడా నికి అవకాశం కలుగుతుందన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగ అధికారులు ప్రభుత్వం తీసు కున్న ఈ నిర్ణయాన్ని  అభినందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.