calender_icon.png 21 April, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తుంది

21-04-2025 12:04:37 AM

వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి మార్చి 20 (విజయ క్రాంతి) రైతుల కుటుంబాల్లో ఆనందం వెళ్లి విడుస్తుందిని వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఎలిగేడు మండలంలోనీ ధూళికట్ట, ముప్పిరితోట, రాములపల్లి, ర్యాకేల్ దేవుపల్లి  ఎలిగేడు గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే  ప్రారంభించారు.

ఈ సందర్బంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని సమాజంలో రైతులకు కూడా గౌరవం పెరిగిందన్నారు..

తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ధాన్యం ఎలాంటి కటింగులు లేకుండా కొనుగోలు చేస్తున్నామని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని, రైతు రుణమాఫీ , రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ వంటి సంక్షేమ పథకాల వల్ల రైతుల కుటుంబాల్లో ఆనందం వెళ్లి విరుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలిగేడు సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి డైరెక్టర్ రమేష్ బాబు, రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.