మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్, జనవరి 25 (విజయక్రాంతి) : ప్రతి మనిషి ఎలాగో ఒకలా బతకడం జరుగుతుందని.. బతుకుతూ మరింత మందిని బతికించడంలోనే అసలైన సంతృప్తి ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అక్షర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ, కళాశాల ఫ్రెషర్స్ డే పార్టీ, మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వీడ్కోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి, పారిశుద్ధ్య కార్మికులకు రెడ్ క్రాస్ సమకూర్చిన ఫ్యామిలీ కిడ్స్, బెడ్ షీట్స్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అందించారు.
ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ డిప్లొమా అని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని, ఈ డిప్లొమా కోర్సులు ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. మున్సిపల్ పాలకవర్గం గడిచిన ఏడాది కాలంలో అద్భుతంగా పనిచేస్తుందని, మీరు చేసిన సేవలు చరిత్రలు నిలిచిపోతాయని ఎమ్మెల్యే కొనియాడారు. పార్టీల కచ్చితంగా పట్టణాన్ని అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
రెడ్ క్రాస్ ద్వారా పారిశుద్ధ కార్మికులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, ఫ్లోర్ లీడర్స్ రవికిషన్ రెడ్డి, సాదత్, అంజయ్య, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.