calender_icon.png 16 January, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనందంగా.. సురక్షితంగా!

26-10-2024 12:00:00 AM

దీపావళి అంటేనే టాపాసుల మోత. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా జరుపుకుంటారు. వెలుగులు విరజిమ్మే చిచ్చుబుడ్లు.. రాకెట్లు ఎంతో ఆనందాన్నిస్తాయి. కానీ టపాసుల మాటున ప్రమాదాలు పొంచి ఉంటాయి. పండుగ అనేది సురక్షితంగా జరుపుకునే విధంగా ఉండాలి. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా పండుగ చేసుకోవచ్చు.

ప్రతిఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య వేడుకగా  జరుపుకునే పండుగ దీపావళి. పటాకులు కాలుస్తూ సంబరాల్లో మునిగి తేలుతారు. అయితే ప్రతి దీపావళికి చాలామంది గాయాలపాలవుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు గాయాలబారిన పడటమే కాకుండా శ్వాసకోశ లాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే సురక్షిత పద్ధతుల్లో టపాసులకు బదులు గ్రీన్ దీపావళి జరుపుకోవాలని చెబుతున్నారు నిపుణులు. పర్యావరణ దీపావళితో సురక్షితమే కాకుండా ఆనందంగా ఉండొచ్చని చెబుతున్నారు. 

జాగ్రత్తలు..

కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకున్నా టపాసుల వల్ల ప్రమాదం ఏర్పడితే ప్రథమ చికిత్స గురించి కొంతైనా అవగాహన ఉండాలి. ఆస్పత్రికి వెళ్లేలోపు టపాసులతో గాయపడిన పిల్లలను తొలుత నిప్పుకు దూరంగా తీసుకురావాలి. నిప్పు అంటుకుని గాయమైన శరీర భాగంపై నుంచి వస్త్రాలు తొలగించాలి. గాయాలపై ఐస్‌తో మర్దన చేయొద్దు. అలాగే వెన్న, గ్రీజ్, పౌడర్ లాంటి వాటిని రాయొద్దు. వీటి వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. ఇవన్నీ చేసేలోపు డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.

చేయాల్సినవి..

* పండుగ రోజున సిల్క్ లాంటి దుస్తులు ధరించకూడడు. పిల్లల రక్షణకు మందపాటి కాటన్ దుస్తులు మంచివి.

* టాపాసులు కాల్చేటప్పుడు పక్కనే బకెట్ నీళ్లను పెట్టుకోవాలి. 

* షూ లేదా చెప్పులు కచ్చితంగా వేసుకోవాలి. 

* పిల్లలు టపాసులు పేల్చేటప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. 

* కొందరికి అనారోగ్య సమస్యలుంటాయి. అలాంటివారిని పొగకు దూరంగా ఉంచాలి. 

* చాలావరకు కాల్చి విసిరేస్తుంటారు. అలా చేయొద్దని గట్టిగా చెప్పాలి. 

* ఎట్టి పరిస్థితుల్లో చేతుల్లో టపాసులు పేల్చవద్దు. 

చేయకూడనివి..

* పేలకుండా మధ్యలో ఆగిపోయిన టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయొద్దు. 

* కొన్ని పేలకపోయినా చేతిలోకి తీసుకోగానే పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉంచాలి. 

* ముందు జాగ్రత్తగా అలాంటివాటిపై నీటిని చల్లాలి.

* బాణాసంచా ఎప్పుడూ ఇంట్లో కాల్చేందుకు ప్రయత్నించొద్దు. బహిరంగ ప్రదేశాల్లోనే పేల్చాలి.

* జేబుల్లో టపాసులు పెట్టుకుని తిరగడం కూడా ప్రమాదకరం. 

* ఎక్కువ శబ్దం, పొగ వచ్చే పేలుడు పదార్థాలను కొనొద్దు.

* కర్టెన్లు లేదా మండే పదార్థాల దగ్గర వెలిగించిన కొవ్వొత్తులను ఉంచొద్దు.

aఒకేసారి ఎక్కువ పటాకులు కాల్చకండి. అది ప్రమాదానికి దారితీస్తుంది.

* క్రాకర్లను వెలిగించడానికి అగ్గిపెట్టెలు లేదా లైటర్లను వాడొద్దు

* రోడ్డుపై క్రాకర్స్ పేల్చవద్దు. ఇది కూడా ప్రమాదాలకు కారణమవుతుంది.

చిన్నారులపై ప్రభావం

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. ఐదేళ్లలోపు వయసున్న లక్షకుపైగా చిన్నారులు వాయు కాలుష్యం వల్లే మరణించారని పేర్కొంది. భారత్‌లో ఈ మరణాల్లో గాలిలో ఉండే పీఎం 2.5 కారణమని ‘ఎయిర్ పొల్యూషన్ అండ్ చైల్ హెల్త్’ పేరుతో రూపొందించిన నివేదిక వెల్లడించింది.

నెలలు నిండకముందే ప్రసవాలు, తక్కువ బరువుతో శిశువులు జన్మించడం, పుట్టుకతోనే చిన్నారుల్లో శారీరక, మానసిక లోపాలు రావడంతోపాటు మరణాలకు కూడా కారణం కావొచ్చని నివేదిక తెలిపింది. కాలుష్యం అందరిపై దుష్ప్రభావం చూపుతుందని, అయితే చిన్నారులపై ఇది మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.

శ్వాసకోశ సమస్యలు వేధిస్తాయి

దీపావళి అంటే టపాసుల పండుగ. పిల్లలు క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. దాని వల్ల పొగ వ్యాపిస్తుంది. చలికాలంతోపాటు కాలు ష్యం వల్ల గాలి కలుషితం అవుతుంది. ఇటువంటి సమయంలో పిల్లలను శ్వాస కోస సమ స్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. శ్వాస సమస్యలతో బాధపడే పిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మనషులే కాదు జంతువులు కూడా ఇబ్బంది పడతాయి. అందుకే పర్యావరణహిత క్రాకర్స్ వాడటం బెస్ట్.

 డాక్టర్ దిలీప్‌కుమార్