సంతాపం ప్రకటించిన మంత్రి పొన్నం
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కె. హనుమంత రావు అనారోగ్యంతో చికిత్య పొందుతూ మృతి చెందారు. బాయిసాబ్ గా కార్యకర్తలు పిలిచేవారు. పార్టీ నిర్మాణం కోసం ఎంతో శ్రమపడ్డ కె.హనుమంతరావు మృతి పార్టీకి తీరని లోటని రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. సంపూర్ణ రాజకీయ అనుభవశాలి కే.హనుమంతరావు.. జిల్లా కాంగ్రెస్ పక్షాన వారికి శ్రద్ధాంజలి ఘటించారు, మానకొండూరు ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు హనుమంతరావు (బాయ్ సాబ్) రాత్రి అకాల మరణం చెందడం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతిని పార్టీ శ్రేణులు తెలియజేశారు.
పొన్నం ప్రభాకర్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు 1991 నుండి 96 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పార్టీకి సేవలు అందిస్తూ, పార్టీ నిర్మాణం కోసం చాలా శ్రమ పడ్డారు హన్మంతరావు. కార్యకర్తల పట్ల ఎంతో అభిమానాన్ని చూపిన సంపూర్ణ రాజకీయ అనుభవ శీలి అయిన హనుమంత రావు గారి కరీంనగర్ జిల్లా చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని కాంగ్రెస్ పార్ట్ సంతాప సందేశంలో పేర్కొంది. శంకరపట్నం మండలం ఎరడవెళ్లిలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ టి. సంతోష్ కుమార్ తో పాటు నాయకిలిబు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు.