12-04-2025 12:00:00 AM
పాల్గొన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రం భీం అసిఫాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తులు హనుమాన్ శోభా యాత్ర అట్టహాసంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరహనుమాన్ ఆలయం నుంచి హనుమాన్ దీక్ష స్వాములు, భజరంగ్ దళ్, హిందూ ఉత్సవసమితి సభ్యులు ఏర్పాటు చేసిన హనుమాన్ శోభాయాత్రను బీజేపీ సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు కొబ్బరికాయ కొట్టి శోభా యాత్రను ప్రారంభించారు.
ఈ యాత్ర జిల్లా కేంద్రం లోని పలు వీధులలో జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో, భక్తి గీతాలతో, యువకుల నృత్యాల తో జోరుగా కొనసాగింది. ఈ శోభాయాత్రలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్‌ఎస్ నాయకురాలు మార్సకోల సరస్వతి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు భోనగిరి సతీష్ బాబు పాల్గొన్నారు.
భక్తులతో కలిసి నృత్యాలు చేశారు. హనుమాన్ స్వాములకు, భక్తులకు అరిగెల నాగేశ్వరావుతో పాటు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పండ్లను, అల్పాహారాన్ని, చల్లటి త్రాగు నీటిని ఏర్పాటు చేశారు. బజారు వాడి హనుమాన్ ఆలయం వద్ద భక్తులు, స్థానిక ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు శోభాయాత్రలో హనుమాన్ దీక్షస్వాములు, భక్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.