calender_icon.png 24 February, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నశక్కర్గలో 21న హనుమాన్ మందిరం ప్రారంభోత్సవం

19-02-2025 12:00:00 AM

మద్నూర్, ఫిబ్ర వరి 1౮ (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా  మద్నూర్ మండలం చిన్న శక్కర్గ గ్రామంలో హనుమాన్ మందిరం ప్రారంభోత్సవం నిర్వహించడం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు. ఈ మందిరం ఈనెల 21 న శుక్రవారం  శ్రీ శ్రీ 108 మల్లికార్జున్ శివాచార్య  మహారాజ్ (కథగావ్) ఆధ్వర్యంలో హనుమాన్ మందిరం ప్రారంభోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ప్రారంభోత్స కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మహారాజ్ యొక్క సంభాషణలు, కీర్తనలు, పూజ పురస్కారాలు తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  గ్రామస్తులు కలిసి కట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.