calender_icon.png 6 April, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ నివాసంలో హనుమాన్ సంకీర్తన

05-04-2025 08:06:51 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): పట్టణంలోని కాపువాడలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ నివాసంలో శనివారం శ్రీ హనుమాన్ పూజా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హనుమాన్ శత అష్టోత్తర నామావళి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ భక్తులకు భిక్ష (అన్నదాన) కార్యక్రమం చేపట్టారు.భక్తి సంకీర్తనలతో స్వామివారిని కొలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మన సాంప్రదాయాలను కాపాడుకోవడం తోపాటు భావితరాలకు సంస్కృతిని అందించాలన్నారు.