12-04-2025 10:34:02 PM
చిన్న చింతకుంట (విజయక్రాంతి): అభయ ప్రదాత, ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచే శ్రీ హనుమంతుడి జయంతి సందర్భంగా శనివారం ఊరూరా శ్రీ హనుమంతుని శోభాయాత్రలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండల కేంద్రంలో బస్టాండ్ కూడలిలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువకులు కాషాయ జెండాలను చేత బోని శ్రీ హనుమంతుని శోభాయాత్ర కొనసాగింది. మండలంలోని ఆయా గ్రామాలలో శ్రీ హనుమంతుని జయంతి సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు యువకుల జైశ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో శోభాయాత్ర లనిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ హనుమంతుని జయంతి సందర్భంగా గ్రామాలలో పండుగ వాతావరణం కనిపించింది.