11-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్ 10(విజయ క్రాంతి):కేస్లాపూర్ వీరంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ నెల 12న నిర్వహించనున్న హనుమజ్జయం తి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మీ గురువారం తన నివాసంలో ఆలయ కమి టీతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొవ లక్ష్మీకి ఆహ్వాన పత్రికను అందజేసి జయంతి ఉత్సవాలకు రావాలని కోరినట్లు తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేశామని భక్తులు అధిక సంఖ్యలో ఈ జయంతి ఉత్సవాలకు విచ్చేసి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.
అనంతరం ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షు లు అరిగెల నాగేశ్వరరావు నివాసంలో కూడా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుండ వెంకన్న, అలయ కమిటి ప్రముఖులు పిన్న వివేక్, ఏకీరాల శ్రీనివాస్, చిలుకూరి రాధాకృష్ణ చారి, డాక్టర్ మధు, మురళి గౌడ్, లక్ష్మిణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.