12-04-2025 11:38:15 PM
సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలల్లో 12వ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం కడ్పల్ గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్బంగా గ్రామ హనుమాన్ మందిరం వద్ద గ్రామ పురోహితులు, అర్చకులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, గ్రామస్థులు ఆలయం వద్ద స్వామి వ్రతాలు నిర్వహించి తీర్థ ప్రసాదం పుచ్చుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్థులు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద ఎత్తులో పాల్గొని హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.