12-04-2025 07:54:06 PM
కొల్చారం (విజయక్రాంతి): హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారంలో గ్రామ పురోహితులు కోలాచల శ్రీనివాస శర్మ ఇంటి వద్ద ఉన్న హనుమాన్ దేవాలయం నుండి బస్టాండ్ హనుమాన్ దేవాలయం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బొడ్రాయి వద్ద జెండా ఆవిష్కరించారు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామికి సింధూర లేపనం గావించారు. పురోహితులు కృష్ణ శర్మ మంత్రోచ్ఛారణలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు యువకులు హనుమాన్ దేవాలయంలో కూర్చొని భక్తిశ్రద్ధలతో ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ హనుమాన్ చాలీసా చదివి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జూలకంటి సంగమేశ్వర్ (కండక్టర్), రాజిరెడ్డి, పాండురంగ చారి, ముత్యం రఘు, తమ్మలి సంతోష్, భాస్కర్, సాకేత్, సాయికుమార్, సంజీవరావు, బొజ్జ వెంకటరమణ, సంతోష్, ఆకుల సిద్ధిరాములు, లక్ష్మీనారాయణ గౌడ్, శ్రీధర్, అశోక్, తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.