calender_icon.png 20 April, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు

12-04-2025 05:23:20 PM

ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతం నిర్వహించిన భక్తులు..

చేగుంట (విజయక్రాంతి): హనుమాన్ జయంతి పండుగ పురస్కరించుకొని చేగుంట మండలం, చందాయిపెట్, కర్నాలపల్లి, మక్కారాజ్ పెట్, వడియారం గ్రామలలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండలం ఉన్న పలు ఆలయాలలో వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో, సత్యనారాయణ కథ, సామూహిక హనుమాన్ చాలీసా పఠనం చేశారు. చందాయి పెట్ లో భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పబ్బ నాగేష్ గుప్తా, శ్రీరామ్ పండరి, ఉప్పల కోటిలింగం, జూకంటి శోభన్, శిలా బాలేష్, బాసరాజు, బుడ్డ ప్రదీప్, రమేష్ సెట్, గ్రామ పెద్దలు యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.