12-04-2025 06:14:11 PM
పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్ చెరు: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల్లోని హనుమాన్ దేవాలయాల్లో శనివారం ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటాన్ పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విజయోత్సవ ర్యాలీలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో మాజీ ఎంపీపీ గాయత్రి పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ విజయోత్సవ ర్యాలీ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు.
భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయకుమార్, సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, రుద్రారం మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకన్న, హనుమాన్ భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలు, తెల్లాపూర్, అమీన్ పూర్, బొల్లారం మున్సిపాలిటీల పరిధిలో హనుమాన్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు.