calender_icon.png 14 April, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి

13-04-2025 12:00:00 AM

ఎల్బీనగర్ నియోజకవర్గంలో కన్నుల పండువగా హనుమాన్ శోభాయాత్రలు

ఎల్బీనగర్, ఏప్రిల్ 13 :  హనుమాన్ జయంతి వేడుకలు శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ చౌరస్తాలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ పాల్గొన్నారు.   శనివారం సాయంత్రం హయత్ నగర్, మన్సూరాబాద్, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లలో కార్పొరేటర్లు నవజీవన్ రెడ్డి, కొప్పుల నర్సింహ రెడ్డి, లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ లోని ఎంఈ రెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కర్మన్‌ఘాట్‌లో ప్రముఖుల పూజలు 

హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు స్వామివారికి పూజలు నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు ఆకాశ్ పూరి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్  హనుమాన్ దేవాలయం నుంచి హనుమాన్ విజయ యాత్ర నిర్వహించారు.

ఈ యాత్రను కమలానంద భారతి స్వామీ ప్రారంభించారు. ఈ యాత్రలో విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, వివిధ క్షేత్రాల నాయకులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.