calender_icon.png 22 December, 2024 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ విగ్రహం ధ్వంసం

21-12-2024 12:12:07 PM

చేవెళ్ల, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం తొల్కట్ట సమీపంలోని హనుమాన్ ఆలయంలోని విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గమనించిన గ్రామస్తులు శనివారం ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వాళ్లు తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. హనుమాన్ మూలవిరాట్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం క్షమించరాని నేరమన్నారు. నిందితులను పట్టుకొని చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.