calender_icon.png 23 October, 2024 | 3:19 AM

హనుమంతుడు దొరికేశాడట!

19-10-2024 12:00:00 AM

తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబో లో వచ్చిన చిత్రం ‘హనుమా న్’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చి గొప్ప విజయం సాధించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని హనుమాన్ చిత్రం చివరిలో హింట్ ఇచ్చేశారు. అయితే ‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్రకు ఎవరు సటిస్తారనే చర్చ సర్వత్రా సాగుతోంది. తొలుత రానా దగ్గుబాటి పేరు బాగా వినిపించింది. ప్రస్తుతం ఆసక్తికరంగా మరో పేరు తెరపైకి వచ్చింది.

అదే రిషబ్ శెట్టి. ‘కాంతారా’తో మంచి విజయం అందుకున్న కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి ‘జై హనుమాన్‘ చిత్రంలో హనుమంతుడిగా నటించనున్నారట. ఇప్పటికే చిత్రబృందం ఆయనను సంప్రదించగా ఓకే చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి జై హనుమాన్ చిత్రంలో నటించడం ఎంతవరకూ నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.