31-03-2025 07:27:42 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 2 (బుధవారం) సాయంత్రం 7 గంటల నుండి 3 (గురువారం) సాయంత్రం 7 గంటల వరకు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎండోమెంట్ ఆఫీసర్ బాపిరెడ్డి తెలిపారు. వసంత నవరాత్రులను పురస్కరించుకొని ఈ హనుమాన్ చాలీసా పారాయణాన్ని హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొనే హనుమాన్ భక్తులు మరిన్ని వివరాలకు 8520905114 లో సంప్రదించాలని కోరారు.