calender_icon.png 11 April, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతతోనే ప్రశాంతత: ఎమ్మెల్సీ దండే విఠల్

04-04-2025 04:54:37 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఆధ్యాత్మిక భావనతోనే ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. గురువారం రాత్రి బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్ద హనుమాన్ భక్తులు నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఒత్తిడిలతో కొనసాగే మానవ జీవితంలో ఆధ్యాత్మిక చింతన అత్యంత అవసరమని అన్నారు. ఆధ్యాత్మిక భావనలో చెప్పరాని ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించాలని సూచించారు. బుగ్గ దేవాలయంలో హనుమాన్ భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగించడం అభినందనీయమన్నారు.