calender_icon.png 13 February, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జపాన్‌లో హ్యాంగోవర్ లీవ్

13-02-2025 12:51:39 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రతిభావంతులైన వారిని ఆకర్షించడానికి ప్రైవేట్ సంస్థలు సరికొత్త విధానాలు అవలంబిస్తుంటాయి. కాగా జపాన్‌కు చెందిన ట్రస్ట్ రింగ్ అనే సంస్థ రొ టీన్‌కు భిన్నంగా ఆలోచించింది. ఇందుకోసం సరికొత్త పథకాన్ని అమలు చేస్తోంది. తమ సంస్థలో ఉద్యోగులకు ఉచితంగా తాగినంత ఆల్కహాల్‌ను అందిస్తోంది. అంతేకాకు ండా హ్యాంగోవర్ లీవ్ కూడా ఇస్తున్నట్టు ప్ర కటించింది. ఉద్యోగుల్లో ఎవరైనా ఎక్కువగా మద్యం తాగితే ఈ లీవ్‌ను ఉపయోగించుకొ ని మత్తు దిగాక తిరిగి విధుల్లో చేరొచ్చు.