calender_icon.png 11 January, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాంగ్ వీకెండ్‌తో హ్యంగ్ అవుట్ అయ్యారా!

20-08-2024 12:30:00 AM

బిజీలైఫ్‌లో చాలామంది వీకెండ్ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈసారి సండే ఆతర్వాత రాఖీ పండుగ రావడంతో లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో ప్రతిఒక్కరూ సొంతూళ్లకు, వివిధ టూర్లకు వెళ్లారు. ఇష్టమైన ప్రదేశాలను చుట్టేశారు. కుటుంబసభ్యులతో సరాదాగా గడిపారు. అయితే లాంగ్ వీకెండ్ తర్వాత మళ్లీ వర్క్ లైఫ్ లోకి అడుగుపెట్టడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే..?

లాంగ్ వీకెండ్ తర్వాత చాలామంది వర్క్ మోడ్లోకి రాలేరు. ఆఫీసు టార్గెట్స్, పని ఒత్తిళ్లతో పాటు ఇంట్లో సమకూర్చాల్సిన సరుకులపై దృష్టి పెడుతుంటారు. దాంతో చిరాకు, ఆందోళన ఉంటుంది. అయితే చాలామందికి ట్రావెలింగ్ పడదు. త్వరగా అలసిపోతారు. మరికొందరైతే సాధారణ స్థితికి రావాలంటే రెండు , మూడు రోజుల సమయం పడుతుంది. అయితే ఓ ప్లాన్ ప్రకారం ట్రావెల్ చేస్తే జర్నీని ఆస్వాదించవచ్చు. ఎక్కువ లగేజీ, సడన్ ప్లాన్స్ వల్ల వీకెండ్స్ ను ఎంజాయ్ చేయలేకపోతుంటారు.

సెలవులు మంచి విశ్రాంతి ఇచ్చినప్పట్పికీ మరుసటిరోజే వర్క్ మోడ్ లోకి రావడానికి ఆసక్తి చూపరు. ఒత్తిళ్ల నుంచి రీఫ్రెష్ అయ్యేందుకు సెలవులు తీసుకుంటున్నప్పటికీ మళ్లీ వర్క్ ప్లేస్ లోకి రావడం కష్టంగా భావిస్తున్నారు. లాంగ్ వీకెండ్ కు వెళ్తే.. వచ్చినరోజు వెంటనే డ్యూటీకి వెళ్లొద్దు. ఎన్నో కిలోమీటర్ల దూర ప్రయాణం చేస్తారు కాబట్టి తీవ్ర అలసటతో అలసిపోతారు. శరీరం కూడా సహకరించదు. కాబట్టి మళ్లీ బాడీని రెడీ చేయడానికి కనీసం ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకోవాలి. 

ఒకవేళ ఆఫీసుకు వెళ్తే.. ఆరోజు పూర్తి పనిభారంతో అలసిపోకుండా చిన్న చిన్న టాస్క్‌లను మాత్రమే కంప్లీట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. వీకెండ్ తర్వాత శరీరం కచ్చితంగా విశ్రాంతి కోరుకుంటుంది. కాబట్టి తప్పనిసరి అయితేనే ఆఫీసులకు వెళ్లండి. టూర్లకు వెళ్లామా.. వచ్చామా అన్నట్టుగా కాకుండా ఆత్మీయులకు మంచి బహుమతులు తీసుకొచ్చినట్లయితే.. ఆ ఆనంద క్షణాలు మంచి రీఫ్రెష్‌ను ఇస్తాయి.  రెగ్యులర్ వ్యాయామాలను కంటిన్యూ చేయడం వల్ల హాయిగా ఉండొచ్చు.