calender_icon.png 14 February, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డయాలసిస్ పేషెంట్ కు చేయూత ట్రస్ట్ ఆర్థిక సహాయం...

13-02-2025 10:11:53 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని వేపలగడ్డ పంచాయతీ కొమ్ము నకిరిపేట గ్రామంలో కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ పేషెంట్ బాడిష బాలకృష్ణ అనే రోగికి మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన చేయూత ట్రస్ట్ గురువారం రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. గత మూడు సంవత్సరాల నుండి రెండు కిడ్నీలు పనిచేయకుండా ఉండటంతో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడని అప్పులు చేసి లక్షల రూపాయలు వైద్యం చేయించిన పూర్తిస్థాయిలో జబ్బు తగ్గకపోవడంతో ఒక్కొక్క సందర్భంలో కనీసం డయాలసిస్ చేయించటానికి ఆటోకి డబ్బులు లేని పరిస్థితిలో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తు గడిపిన రోజులు ఉన్నాయని బాధితుడి భార్య నాగేశ్వరి కన్నీరు పెట్టుకుంటూ విలపించారు.

ఇద్దరు పిల్లలను హాస్టల్లో చదివిస్తూ తన భర్తకు సేవలు చేసుకుంటూ కాలం గడుపుతూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బంజర్ గ్రామానికి చెందిన చేయూత ట్రస్టు దృష్టికి సమాచారం అందగానే మానవత్వంతో చేయుత ట్రస్ట్ ముందు అడుగులు వేసి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా చేయూత ట్రస్ట్ వారు మాట్లాడుతూ... నిరుపేద కుటుంబాలలో వెలుగులు నింపటానికి విద్య వైద్య రంగాలను ఎంచుకొని తమకే చేతనైన సహాయం అందిస్తూ తెలిసిన వారి చేత కూడా సహాయం అందించే విధంగా కృషి చేస్తూ బాధిత కుటుంబాలకు అండగా నిలబడుతూ అడుగులు వేస్తుందని అన్నారు. ట్రస్టులో ఉన్నవారు మంచి మానవత విలువలతో కూడిన ఉండటం నిరుపేద కుటుంబాల ఆదుకోవడంలో అందరి సహకారం మెండుగా ఉండటం ట్రస్ట్ సేవలు గ్రామం నుండి మండలం, జిల్లా వరకు కొనసాగించటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి మానవతా విలువలు పలువురికి సహాయం చేయాలనే తపన వెలుగులోకి తీసుకొచ్చేందుకు చేయూత ట్రస్ట్ ఆదర్శంగా నిలబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కైపు నాగిరెడ్డి, గౌరవాధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి జక్కిరెడ్డి మల్లారెడ్డి, సహాయ కోశాధికారి గాది నర్సిరెడ్డి, సభ్యులు కె. చిన్న నాగిరెడ్డి, కే. వెంకట్ రెడ్డి, సెనగ మల్లేశ్వరరావు, సోము ఆదిరెడ్డి, బెజ్జం వెంకటరామిరెడ్డి, తమ్మినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.