13-03-2025 01:49:31 AM
కొత్తపల్లి, మార్చి 12 (విజయ క్రాంతి): నగరంలోని సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులకు పూర్వాచార్యులు భగవాన్ దాస్ ఇంగ్లీష్ ఇటాలిక్ హ్యాండ్ రైటింగ్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఆచార్యులు నాలుగు రోజులపాటు ఇంగ్లీష్ ఫొనెటిక్స్ పై శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు బల్మూరి కరుణాకర్ రావు, కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, సమితి అధ్యక్షులు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, సమితి కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ, విభాగ్ కార్యదర్శి మేచినేని దేవేందర్ రావు, సహ కార్యదర్శి కొండా గంగాధర్, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్, తాటి రాజేశ్వరరావు, ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.