calender_icon.png 9 April, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో హ్యాండ్స్ ఆఫ్

07-04-2025 01:14:25 AM

  1. ప్రెసిడెంట్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు
  2. పెద్దఎత్తున పాల్గొంటున్న పౌరులు 
  3. ట్రంప్‌కు భారీ షాక్

వాషింగ్టన్, ఏప్రిల్ 6: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. కొద్ది రోజులుగా ఆయన తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో విసిగెత్తిపోయిన అమెరికన్లు ‘హ్యాండ్స్ ఆఫ్’ పేరిట నిరసనలు చేపడుతున్నారు. వందలు వేలల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఒక్క చోట అని కాకుండా అమెరికా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ నిరసనలు మిన్నంటాయి.

డోజ్ అధినేత ఎలాన్ మస్క్‌కు కూడా వ్యతిరేకంగా వారు నినదించారు. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన నుంచి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాజీ అధ్యక్షుడు తీసుకొచ్చిన పాలసీలను వ్యతిరేకించడం, ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు తీసేయడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల మీద ప్రతీకార సుంకాలు విధించడం, అక్రమ వలసదారులని చెప్పి అమెరికా నుంచి కొంత మందిని నిర్దాక్షిణ్యంగా వెలేయడం వంటివి చేస్తున్నారు. 

జర్మనీలో కూడా..

హ్యాండ్స్ ఆఫ్ నిరసనలు కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా జర్మనీలో కూడా హోరెత్తాయి. అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్, ఫ్లోరిడా, కొలరాడో, లాస్ ఏంజెల్స్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ హ్యాండ్స్ ఆఫ్ నిరసనలు అమెరికాలో వేయి ప్రాంతాల్లో జరిగినట్టు తెలుస్తోంది. ఇక జర్మనీలోని ప్రాంక్‌ఫ్రూట్, బెర్లిన్ నగరాల్లో వందల సంఖ్యలో నిరసనకారులు రోడ్లమీదకు వచ్చి ట్రంప్, ఎలాన్ మస్క్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘బుల్ షిట్’ అని రాసి ఉన్న ప్లకార్డులతో తమ నిరసన తెలియజేశారు. ప్రపంచదేశాల మీద పరస్పర సుంకాల దాడి మొదలుపెట్టిన నుంచే ట్రంప్‌పై అంతటా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ట్రంప్ పాలన విధానాలను విమర్శిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా నిర్ణయం మార్చుకోనని ట్రంప్ ఇది వరకే ప్రకటించారు.