26-02-2025 12:06:31 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న భాదితులకు పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి వారికి అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేసారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోర్టల్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో బాధితులు కోల్పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టడం జరిగితుందన్నారు. గత రెండు నెలల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 170 మంది భాధితులకు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తిరిగి వారి ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, ఐటి సెల్ ఇంచార్జి సీఐ నాగరాజు రెడ్డి మరియు ఐటి సెల్ సభ్యులు విజయ్, నవీన్, మహేష్ పాల్గొన్నారు.