calender_icon.png 25 October, 2024 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాండ్లూం టెక్నాలజీని ఏర్పాటు చేయాలి

02-08-2024 12:05:00 AM

కేంద్రమంత్రికి ఎంపీ అరవింద్ విజ్ఞప్తి

నిజామాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం టెక్నాలజీని ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జౌళి, టెక్స్‌టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేవారు. ఐఐహెచ్‌టీ అందించే అధునాతన పరిజ్ఞానంతో కార్మికులు నూతన డిజైన్లు ఆవిష్కరించేందుకు వీలు పడుతుందని పేర్కొన్నారు.

నేతన్నలకు భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రింటెడ్ చీరల ఉత్పత్తి, విక్రయాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. చేనేతలపై జీఎస్టీని తొలిగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం భోగ శ్రావణి పోచపల్లి శాలువాతో మంత్రిని సన్మానించారు. హామీల అమలుకు చర్యలు తీసుకుం టానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.