04-09-2024 01:22:08 AM
నేతన్నలకు దన్నుగా నిలవాలి: మంత్రి పొన్నం
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాం తి): టీచర్స్ డే రోజున నేతన్నలు మగ్గాలపై నేసిన శాలువాలను వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. చేనేత వస్త్రాలను ఉపయోగించడం వల్ల నేతన్నలకు దన్నుగా నిలిచినట్లుందని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులను సన్మానించే సందర్భంలో కాటన్ శాలువాలు వాడాలని ప్రభుత్వ పక్షాన విద్యాశాఖ అధికారులను సైతం కోరుతున్నట్లు తెలిపారు. గణేశ్ ఉత్సవాల్లో అతిథులకు సైతం నేతన్నల శాలువాలు వాడాలన్నారు. సింథటిక్‌తో పర్యావర ణానికి ఎంతో నష్టం కలుగుతుందని, కాటన్‌తో నేసిన వాటితో ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు.