హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): జాతీయ చేనేత దినోత్సవాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహిం చారు. మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చేనేత జాతీయ అవార్డు గ్రహీతలను సన్మానించారు. ఈ సందర్భంగా పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే నేతన్నలకు న్యాయం జరిగిందని అన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ కూడా మేలు చేస్తుందని తెలిపారు. నేతన్నల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొంది స్తుందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ నేత కార్మికులను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు రవికుమార్, మచ్చ వరలక్ష్మి, నర్సింగ్‌రావు, గూడురు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.