calender_icon.png 24 January, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు సెల్ ఫోన్లు అప్పగింత..

23-01-2025 10:28:39 PM

చార్మినార్ (విజయక్రాంతి): చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో వేరువేరుగా తమ సెల్ ఫోన్ లను పోగొట్టుకున్న బాధితులకు తిరిగి వారి సెల్ ఫోన్ లను అందజేశారు. చైతన్యక ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ తెలిపిన వివరాల ప్రకారం... వేరు వేరు ప్రాంతాలలో సెల్ఫోన్లను పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు క్రైమ్ టీం పార్టీ పోలీసులు చోరీ చేసిన నిందితులను గుర్తించి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోగొట్టుకున్న వారికి తిరిగి గురువారం అప్పగించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్ఐ రాయుడు త్రిమూర్తులు హెడ్ కానిస్టేబుల్ బి కుమార్, వెంకటేష్ ప్రేమ్ సింగ్ మహేష్ తో పాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు.