నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సమతా ఫౌండేషన్(Samatha Foundation) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రధాన కార్యాలయాన్ని ఈనెల 22న నరసాపూర్లో ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ తెలిపారు. శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క(Minister Seethakka), ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, బొజ్జు పటేల్ రామారావు పటేల్ కు జిల్లా కలెక్టర్ కు ఆహ్వాన పత్రాలను అందించినట్లు ఆయన తెలిపారు.