కోదాడలో చేనేత హస్త కళ ప్రదర్శన అమ్మకం ప్రారంభం..
చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి..
జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు..
కోదాడ (విజయక్రాంతి): మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే చేనేత వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో గల టిటిడి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన చేనేత హస్తకాల ప్రదర్శన, అమ్మకమును వారు ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడి ప్రదర్శనలో చేనేత దుస్తులు రకరకాల మోడల్స్ లో తక్కువ ధరకే లభిస్తాయని నేటి నుండి ఈనెల 20 వ తారీఖు వరకు 15 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శన అమ్మకములను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రావణ్ చౌదరి, వినోద్ కుమార్, వంగవీటి గురుమూర్తి, పబ్బా గీత, జగనీ ప్రసాద్, గరణే శ్రీనివాసరావు, ఆగిర్ మధు, బెలీదే భరత్, చల్ల అశోక్, బోనాల సైదారావు, వంగవీటి లోకేష్, పబ్బ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.