కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా బాలికల పాఠశాలలో గత రెండు రోజులుగా క్రీ.శే గడిగొప్పుల సదానందం (పీడీ) జ్ఞాపకార్థం జరుగుతున్న 38వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు లీగ్ మ్యాచులు కోనసాగగా... లీగ్ మ్యాచులలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలు సెమి ఫైనల్ పోటీలకు చేరుకున్నాయి. సెమి ఫైనల్ పోటీల్లో కరీంనగర్ జట్టుపై 02-26 పాయింట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజయం సాధించగా, రంగారెడ్డితో మహబూబ్ నగర్ జట్టుకు పోటీ జరగగా 20-06 పాయింట్లతో మహబూబ్ నగర్ జట్టు గెలుపొంది . సోమవారం ఉదయం 9గంటలకు జరిగే ఫైనల్ పోటీలకు ఎంపికయ్యాయి. సెమి ఫైనల్ మ్యాచులను రాయ్ సెంటర్ ప్రధానకార్యదర్శి సుధాకర్,ఉమెన్ రైడ్స్ చీఫ్ లింగరావు,ఆశ్రమ పాఠశాల క్రీడల అధికారి బండ మీనారెడ్డి,వాసవి హైస్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ రూప క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు క్రీడాకారులను కోచ్ సునార్కర్ అరవింద్ ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గొనె శ్యాంసుందర్ రావు,ప్రధానకార్యదర్శి కనపర్తి రమేష్,రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్యామల పవన్ కుమార్ ,ఆశ్రమ పాఠశాల క్రీడల అధికారి మీనారెడ్డి,కోచ్ సాగర్,రాకేష్,తిరుమల్,పలువురు అభినందించారు.