* భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ లేఖ
ఢాకా, డిసెంబర్ 23: బంగ్లాదే శ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్ప గించాలని తాజాగా అక్కడి తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభు త్వానికి లేఖ రాసింది. న్యాయ ప్రక్రియలో భాగంగా ఆమెను విచా రించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నది. వ్యక్తుల అప్పగింతకు సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం ఉందని, ఆ ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదే శ్‌కు అప్పగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
మరోవైపు హసీనా ను బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు అక్కడి హోంశాఖ ముమ్మరంగా చర్య లు చేపడుతున్నది. బంగ్లాదేశ్‌లో ఉద్రి క్తలు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు 5న షేక్ హసీనా భారత్‌కు చేరుకుని, అప్ప టి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతు న్నారు. ఆమెతో పాటు ఆమె మంత్రి వర్గం, సలహాదారులు, సైనికాధికారు లపై అనేక నేరారోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ (ఐసీటీ) ఇప్పటికే వారెం ట్ జారీ చేసింది.