calender_icon.png 17 January, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వండి

05-09-2024 01:39:31 AM

హైకోర్టులో బీజేపీ నేత చింతల పిటిషన్

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో అనేక మం ది ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని జస్టిస్ బీ విజయ్‌సే న్‌రెడ్డి బుధవారం విచారించారు. ఇదే అంశంపై ఇతర పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారణ చేస్తున్నదని, ఈ పిటిషన్‌ను కూడా అదే బెంచ్‌కు నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చారు.